8, మే 2015, శుక్రవారం

॥ ప్రయాణం॥ 

చూపులు కిటికీలోoచి పరిగెడుతూ
ఆవలి దృశ్యాలను స్పర్శించి
ఆస్వాదిస్తున్నాయి

దృశ్యాలకు అంతరంగానికి
పొoతనలేని అలజడులు
తలమునకలే అవుతూ 
కాలం  లెక్కించలేనంతగా

అక్షరాలకు కనులనతికించినా
శ్రద్దలేని  మనసు సహకరించక
చేరాల్సిన గమ్యం దగ్గరవ్వాలని ఆరాటం 

కాగితంపై కొన్ని అక్షరాలను అంటించాలని ప్రయత్నం
ఆవలి దృశ్యాలకు అంటుకున్న చూపుల్నిపెకిలించాలని
దూరాన కొండలు పారిపోతూ
గమ్యాన్ని దగ్గర చేస్తున్నట్లు భావన

ఆలస్యాన్ని భరించలేని మనసు
తొoదరపడుతూ
పరుగెడుతున్న ప్రయాణం

మధ్యలో మెరిసి వెళుతున్న మిణుగురు మెరుపులు
చూపులు చీకటిలో తారాడుతూనే వున్నాయి
బాగా దూరం కాస్త దగ్గరైనట్లు అనిపించి 

వేకువలో మజిలీ చేరాలని '
నిదురనూ ఆహ్వానించాలని నిర్ణయించాను
ప్రవహించే చూపులకి ఆనకట్ట వేసి
రెప్పలు మూసి మనసుతో ముచ్చట్లు మొదలెట్టాను

'నిదుర రాని రేయి కూడా నాతో
వెకువకై ఎదురుచూస్తూ
చేరాల్సిన బంధానికి చేరువ కావాలని...!!

.....వాణి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి