8, మే 2015, శుక్రవారం

//అక్షరాలు//

గాయపడ్డ క్షణాలు బాకులా గుచ్చుతున్న జ్ఞాపకాలే
మలాము ఎంత రాసినా మానిపోని రాచపుండును తలపిస్తూ

అనుక్షణం ఆ ఆలోచనలే మరలిపోని ఆవేదనలే
బాధలు భావాలై మౌనాక్షరాలౌవుతూ
గతం నీలినీడలు గాయాన్ని మానిపించే అక్షరాలవుతూ

చెదిరిన మనసుకు ఓదార్పుగా
గుండె గాయానికి మంత్రించే ఆయుధాలుగా
ఆత్మీయత పంచే అదృష్టాలుగా
మెలిపెడుతున్న జ్ఞాపకాలు మరిపించే సాధనాలు అక్షరాలు

నిర్లక్ష్యాల నిదర్శనాలుగా
బాధ్యత మరచిన బంధాలు ప్రశ్నించే అవకాశాలుగా
బాధల భావాలను వెలిబుచ్చే మనసుకు ఊరట కలిగిస్తూ
మాటలు పలకలేని పెదాలు అక్షరభావాలు ఒలికిస్తూ

స్వాంతన నాకు నేనుగా చెప్పుకుంటూ..
గాయపడ్డ మనసుతో గమనం సాగిస్తూ,..!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి