8, మే 2015, శుక్రవారం

......కావాలనిపిస్తుంది.......
పెదవులు విడివడ్డమే లేదు
కాసిన్ని మాటలు పలికిద్దామంటే
కన్నీళ్ళు ఇంకిపోనే లేదు
కొత్త కన్నీళ్ళు కొలువుదీరుతున్నాయి
నిరాశలూ నిండు కుండలే
సర్ధుబాటు చేసుకోనేలేదు
ఆశలేని తనం కొత్తగా
అందిపుచ్చుకుంటోంది
కనులు మూతపడ్డమే లేదు
కలలు కనడమెలా
స్వప్నాలు కావాలనిపిస్తోంది
నిదురలోనైనా నవ్వుకుందామని
మనసును త్రవ్వుతూనే వున్నా
చిటికెడు మధురత
చిరునవ్వుని తెప్పింస్తుందేమోనని
గతంలో కెళ్ళి కలియ తిరుగుతూనే వున్నా
కొంచెం తృప్తి పడ్డ క్షణమేదైనా
తారస పడుతుందేమోనని
జ్ఞాపకాల్లో గాలిస్తూనే వున్నా
మదికి గాయం తగలని సందర్భాలేమైనా
కానవస్తాయేమోనని
కొన్ని కోరికలు
కొంచెం ఆశలు
కాస్త సంతోషాలు
కాసిన్ని నవ్వులు
హత్తుకుంటే బావుండనిపిస్తోంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి