8, మే 2015, శుక్రవారం

.......అంతంలేని అశ్రువులు..........
కడలి తీరం చేరినపుడు
చెదిరిన కలలు తట్టి లేపుతాయి
నీ అప్పటి నవ్వులు కనిపిస్తాయి
కంటి ముందు కదలాడుతున్నట్లే
అనుభూతిస్తుంటాను
మది తీరమంతా గాలిస్తుంది
వేదనే మిగిల్చే వెదుకులాట
మనసు కన్నీటిని రాలుస్తుంది
కెరటాలు ఎగసి పడుతూనే వుంటాయి
ఒక్కోసారి తడుపుతున్న అలలను తడుముతుంటాను
నీ ఆనవాళ్ళేమైన స్పర్శించగలనేమోనని
కెరటం నాఒడి తడిపినపుడు
నీవేనని భ్రమ పడతాను
నీ స్పర్శల ఊహల్లో మురిసిపోతాను
మలికానుకవై మరలొచ్చుంటావని
కొత్త జీవితానికి పునాదులేస్తాను
అల వెనుదిరిగిoది
మనసు చెదిరిపోయింది
మళ్ళీ నీ జ్ఞాపకమే మిగిలింది
మూగనై మిగిలున్నా కడలితీరంలోకన్నీరొలికిస్తూ
కెరటాలను తడుముకుంటూ
ఆశ చావని నా కనులు
చూపులతో తీరాన్ని తడుముతూ
నీ కోసమే వెతుకుతూ
అంతంలేని అశ్రువులను రాలుస్తూ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి