8, మే 2015, శుక్రవారం

||ఇప్పుడు||

తనివితీర నిన్ను నేను తడుముకున్నా అప్పుడు||
మనసులోన నీకోసమెగ తడుముతున్నా నిప్పుడు||

తీర్చలేని కోరికలే కంటిముందు మెదులుతూ
కలతచెంది కన్నీటినెగ ఒలుకుతున్నా నిప్పుడు||

ఒడితడిపిన ముచ్చటనే మురిసిపోయా నవ్వుతూ
దూరమైన స్పర్శకేగ తపిస్తున్నా నిప్పుడు||

గుండెగాయం మానిపోదు జ్ఞాపకమే చెరిగిపోదూ
తనివితీరని ఆశలన్నీ తలుస్తున్నా నిప్పుడు||

సరదాగా వాణిఅమ్మని పిలిచినావు పేరుతోనె
ఒక్కసారి పిలుపుకోసం వేచివున్నా నిప్పుడు||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి