8, మే 2015, శుక్రవారం

॥ శూన్యం ॥
ఆకాశం ఆలోచనలో అంతర్భాగ మౌతుంది
ఊసులెన్నో చెప్పుకోడానికీ తోడవుతుంది
వేకువలు, వెన్నెలలు ఆత్మీయులు
నిత్యం మనసుతో స్పర్శిస్తూ
అమావాస్యలు పున్నములు మిత్రులుగా
పలుకరించి వెళుతూనే వుంటాయ్
వేదనలు చెప్పుకుంటూ నిర్వేదాలు ఒలికిస్తూ
ఎన్నో భావాలు స్రవిస్తూ ఎన్ని అక్షరాలు లిఖించాను
మనో నేత్రాన్ని తెరిచి ఎన్ని కన్నీళ్ళు కార్చాను
ఎన్నో నిర్లక్ష్యాలను తుడిచేసుకున్నాను
ఎంత ఏమరుపాటులో వున్నా ఎన్ని దూరాలు దాటినా
సాహచర్యంలో ధైర్యాన్ని చుట్టుకుంటాను
చినుకులపుడు చిరునవ్వులిస్తూ
హరివిల్లుతో మనసును వర్ణమయం చేస్తూ
ఎన్ని ఓదార్పుల అనుభూతులో
శూన్యము సాగత్యంలో ...!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి