9, మే 2015, శనివారం

నిశీధిలో నడకలు
వెన్నెలకై వెతుకులాటలు
మనసంతా మౌనాలు
నిశ్శబ్ధంతో మాటలు
భావాల మూటలు
అక్షరాలతో మాలలు
జ్ఞాపకాల దొoతరలు
వెలికి వచ్చే స్పందనలు
వెరసి గేయమై పోతోంది
కావ్యంగా మారుతోంది...!!
.... ప్ర శ్న .......


నిద్రలేని రాత్రులు వెక్కిరిస్తూనే వున్నాయి
కురుస్తున్న కన్నీళ్ళు
మనసు తడి ఆరనివ్వడంలేదు 
ఆశలన్నీ మూటకట్టుకుని మూల నుండి పోయాయి
కొత్త జీవితానికి పునాదులేయ్యాలనిపిస్తుంది
కాసిని స్వప్నాలను కలుపుకుంటూ
మనసును ప్రక్ష్యాళన చేసే ప్రయత్నం చేస్తాను
నేత్రాల చెరువులు
నిరాశల నీళ్ళు నిండా నింపుకుని వుంటాయి
జీవితాన్ని మార్చాలని ఆరాట పడుతూనే వుంటాను
తవ్వే కొద్దీ ఊరుతున్న నీళ్ళను ఆపలేక పోతాను
ఆశల ఇటుకలను పేర్చాలనే ప్రయత్నం
చేస్తూనే వుంటాను
తగులుతున్న తడిని
నిండిన గుంటల్ని చూస్తూ
మది ప్రశ్నల వర్షం కురిపిస్తూ వుంటుంది
సాధ్యం కాని సౌధాలు ఎలా నిర్మిస్తావని ?
ఊరుతున్న నీళ్ళలో ఊహలభవనమెలా?
అడియాశల శిఖరాలు అవసరమా?
సర్దుకోమంటూ మనసు హెచ్చరిస్తూనే వుంటుంది
మౌనంగా వుండిపోయాను
చేజారిన చిరునవ్వులు మరల రావనిపించి
మానని గాయాన్ని మది మరువలేదనిపించి.....!!
............ వాణి

8, మే 2015, శుక్రవారం

॥ ప్రయాణం॥ 

చూపులు కిటికీలోoచి పరిగెడుతూ
ఆవలి దృశ్యాలను స్పర్శించి
ఆస్వాదిస్తున్నాయి

దృశ్యాలకు అంతరంగానికి
పొoతనలేని అలజడులు
తలమునకలే అవుతూ 
కాలం  లెక్కించలేనంతగా

అక్షరాలకు కనులనతికించినా
శ్రద్దలేని  మనసు సహకరించక
చేరాల్సిన గమ్యం దగ్గరవ్వాలని ఆరాటం 

కాగితంపై కొన్ని అక్షరాలను అంటించాలని ప్రయత్నం
ఆవలి దృశ్యాలకు అంటుకున్న చూపుల్నిపెకిలించాలని
దూరాన కొండలు పారిపోతూ
గమ్యాన్ని దగ్గర చేస్తున్నట్లు భావన

ఆలస్యాన్ని భరించలేని మనసు
తొoదరపడుతూ
పరుగెడుతున్న ప్రయాణం

మధ్యలో మెరిసి వెళుతున్న మిణుగురు మెరుపులు
చూపులు చీకటిలో తారాడుతూనే వున్నాయి
బాగా దూరం కాస్త దగ్గరైనట్లు అనిపించి 

వేకువలో మజిలీ చేరాలని '
నిదురనూ ఆహ్వానించాలని నిర్ణయించాను
ప్రవహించే చూపులకి ఆనకట్ట వేసి
రెప్పలు మూసి మనసుతో ముచ్చట్లు మొదలెట్టాను

'నిదుర రాని రేయి కూడా నాతో
వెకువకై ఎదురుచూస్తూ
చేరాల్సిన బంధానికి చేరువ కావాలని...!!

.....వాణి 

||  కన్నీటి నదులు ||

గండి పడ్డ కన్నీటి నదులు 
ప్రవాహం ఆగడంలేదు
ఆపే ప్రయత్నంలో
అరచేతులే ఇసుకమూటలౌతున్నా
లెక్కలేని ఆలోచనలు
మదిలో మూటకట్టుకున్నాయి
తీరoలో ఒంటరిగా
మూగ మనసుకు సర్ది చెప్పుకుంటూ
మునివేళ్ళరాతతో ఆలోచనలకు
మార్గాలు వెతుకుంటూ
అప్రయత్నంగా
కుప్పగా మారిన ఇసుకలో
అంతరంగ మదనాలన్నీరాశులు పోశానేమో
అర్ధం కాని స్ధబ్ధత ఆవరించి
తడబడుతూ తీరంలో
ఓటములెన్నో జ్ఞాపకాల్లో
గెలుపులు వెతుకుతూనే వున్నా
కడలి అంచుల్లో కొత్త కోరికలుకై
దూరమైన ఆశలన్నీ
తరంగo తోడుతో తిరిగివోస్తాయని....!!
......కావాలనిపిస్తుంది.......
పెదవులు విడివడ్డమే లేదు
కాసిన్ని మాటలు పలికిద్దామంటే
కన్నీళ్ళు ఇంకిపోనే లేదు
కొత్త కన్నీళ్ళు కొలువుదీరుతున్నాయి
నిరాశలూ నిండు కుండలే
సర్ధుబాటు చేసుకోనేలేదు
ఆశలేని తనం కొత్తగా
అందిపుచ్చుకుంటోంది
కనులు మూతపడ్డమే లేదు
కలలు కనడమెలా
స్వప్నాలు కావాలనిపిస్తోంది
నిదురలోనైనా నవ్వుకుందామని
మనసును త్రవ్వుతూనే వున్నా
చిటికెడు మధురత
చిరునవ్వుని తెప్పింస్తుందేమోనని
గతంలో కెళ్ళి కలియ తిరుగుతూనే వున్నా
కొంచెం తృప్తి పడ్డ క్షణమేదైనా
తారస పడుతుందేమోనని
జ్ఞాపకాల్లో గాలిస్తూనే వున్నా
మదికి గాయం తగలని సందర్భాలేమైనా
కానవస్తాయేమోనని
కొన్ని కోరికలు
కొంచెం ఆశలు
కాస్త సంతోషాలు
కాసిన్ని నవ్వులు
హత్తుకుంటే బావుండనిపిస్తోంది
          || నిర్వేదం ||


వర్ణాలేవీ కానరానంతగా 
మానసం తిమిరాన్ని నింపుకుంది
గమ్యం చీకటి నే సూచిస్తూ 
నలుపు రంగు హత్తుకుపోయింది
మెరిసే రంగులేవీ మురిపించడం లేదు
ప్రపంచాన్ని చూడ్డమే లేదూ
కాసేపలా నింగి నీలపు రంగు
ఆహ్లాదిద్దామంటే
పొద్దుగూకాక చీకటి నిండిన ఆకాశం
నిరాశ గా కనిపిస్తుంది
ఒక్కోసారి కడలిని చూడ్డానికి వెళతానా
అపుడూ నీటి రంగు కంటికి కనపడదు
నిర్వేదం నింపుకున్న మనసు
కడలికి కష్టాన్ని వల్లే వెయ్యడమే సరిపోతుంది
వర్ణాలేవీ కనపడనంతగా
జ్ఞాపకాలు పెనవేసుకున్నాయ్
చెరపలేని గాయాలన్నీ
చిందరవందర చేస్తూనే వున్నాయ్
ఇంద్రధనువు రంగులన్నీ
ఆవహించుకుంటే బావుండనిపిస్తుంది
హరివిల్ల్లునై రంగుల్లో మెరిసిపోవాలనిపిస్తుంది...!!

||వేదన||
మది నగరంలో వెల్లువెత్తే కన్నీటి తరంగాలు
భావాల అలలై ఆగని అక్షరాల ప్రవాహాలు
నిశ్శబ్ధపుఊహలు నీవే అవుతుంటే
నాలోకి నేనే నడిచినట్లుగా వుంది
దు:ఖాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో
నిశిలో నడుస్తూ చీకటిలో వెతుకుతూ
ఆశల రెక్కలు అతికించుకుంటూ
వెన్నెల వెలుగులు విరజిమ్మే రాత్రులకై
కనిపించని మదితో పోరాడుతూనే వున్నా
చరిత్రలో నువ్వు కలిసిపోయావు
కాలం ఒడిలో నేను కరిగి పోతున్నాను
చిధ్రమైన సంతోషాలు కావాలనిపిస్తుంటే
షడ్రుచుల సమ్మేళనమే జీవితమనుకుంటాం
చేదురుచే నాలుకపై తచ్చాడుతుంటే
కొత్త సంవర్శరానికి పలుకుతున్నా స్వాగతమంటూ
గాయాల గతాన్ని మరిపిచే శక్తి నివ్వమంటూ
మెదులుతూ నీ తప్పటడుగులు
మరువలేను నీ బోసి నవ్వులు
ఒడి ఊయలలో ఊపిన ఆక్షణాలు
పంచుకునే నీవు లేక
మరో లోకంలో నీ వున్నా
నీవే లోకంగా జీవిస్తున్నా...!!
॥ శూన్యం ॥
ఆకాశం ఆలోచనలో అంతర్భాగ మౌతుంది
ఊసులెన్నో చెప్పుకోడానికీ తోడవుతుంది
వేకువలు, వెన్నెలలు ఆత్మీయులు
నిత్యం మనసుతో స్పర్శిస్తూ
అమావాస్యలు పున్నములు మిత్రులుగా
పలుకరించి వెళుతూనే వుంటాయ్
వేదనలు చెప్పుకుంటూ నిర్వేదాలు ఒలికిస్తూ
ఎన్నో భావాలు స్రవిస్తూ ఎన్ని అక్షరాలు లిఖించాను
మనో నేత్రాన్ని తెరిచి ఎన్ని కన్నీళ్ళు కార్చాను
ఎన్నో నిర్లక్ష్యాలను తుడిచేసుకున్నాను
ఎంత ఏమరుపాటులో వున్నా ఎన్ని దూరాలు దాటినా
సాహచర్యంలో ధైర్యాన్ని చుట్టుకుంటాను
చినుకులపుడు చిరునవ్వులిస్తూ
హరివిల్లుతో మనసును వర్ణమయం చేస్తూ
ఎన్ని ఓదార్పుల అనుభూతులో
శూన్యము సాగత్యంలో ...!!
॥ మది సంఘర్షణ॥
మది లోతుల్ని తవ్వుకుంటూనే వుంది మనసు
ఎగురుతున్న ఎత్తుల్ని చేరుకోలేక
మధ్యన కలుక్కుమంటున్న ఓ జ్ఞాపకం 
తడి తరగల్ని తుడుచుకోలేక
కన్నీటి సంద్రం చేసిన సందర్భం
చుట్టు ప్రక్కలకి చూపు విదల్చలేక
చిరునవ్వుల పలకరింపులకు
కనులు చెప్పలేని సమాధానం
సందిగ్దమో ,సంసయమో సర్ది చెప్పలేని ప్రశ్నలు
ఎదురోచ్చేఆశలు వెంటాడుతున్న ఆశయాలు
కట్టి పడేస్తున్న మౌన సంఘర్షణలు చేరలేని గమ్యాలు
ఎదురొచ్చే ప్రశ్నార్ధక వదనాలు
మరుపుతో మాయమవుతున్న అంతరంగ దృశ్యాలు
తప్పనిసరి గమనాలు అనాసక్తి అవసరాలు
సాగిపోతూ సమయాలు
చెదిరిపోక వేదన మిగిల్చిన ఆనవాళ్ళు ...!!
||ఇప్పుడు||

తనివితీర నిన్ను నేను తడుముకున్నా అప్పుడు||
మనసులోన నీకోసమెగ తడుముతున్నా నిప్పుడు||

తీర్చలేని కోరికలే కంటిముందు మెదులుతూ
కలతచెంది కన్నీటినెగ ఒలుకుతున్నా నిప్పుడు||

ఒడితడిపిన ముచ్చటనే మురిసిపోయా నవ్వుతూ
దూరమైన స్పర్శకేగ తపిస్తున్నా నిప్పుడు||

గుండెగాయం మానిపోదు జ్ఞాపకమే చెరిగిపోదూ
తనివితీరని ఆశలన్నీ తలుస్తున్నా నిప్పుడు||

సరదాగా వాణిఅమ్మని పిలిచినావు పేరుతోనె
ఒక్కసారి పిలుపుకోసం వేచివున్నా నిప్పుడు||
||అశ్రువులు||
ఓడిన ఆ పోరాటం ఎప్పటికీ గెలవలేను
ఆశపడ్డ ఆశయమే జ్ఞాపకమై మిగిలింది

చిలిపితనాలు గుర్తులై చెమరింతగ మిగిలాయి
తుడవలేని గాయాలు మదిని తడుపుతున్నాయి

విరిగిన మనసునింక అతకలేక పోతున్నా
ఎదలోని వేదనతో బ్రతుకీడ్చుకొస్తున్నా

తీరదులే నా కోరిక మరల రావు నువ్వని తెలుసు
స్మృతిగా నా గుండెలో మెరుస్తూనే వుంటావు

ఇంతకన్నా ఓ అమ్మకి మరో ఓటముంటుందా
బలవంతపు బ్రతుకు కన్నా మరో కష్టముంటుందా

కన్నీటి సంద్రాన్నిఈదుతూనే వున్నాను
ఓడిన కెరటాన్నై మిగిలిపోతు వున్నాను

దూరమయిన దగ్గరితనం నీదే అయిపోయింది
నిట్టూర్పుల తడులతో మునిగి పోతువున్నాను

అశ్రువులను జయించాలని అక్షరాన్ని ప్రేమించాను
కంటి ముందు కవనంలో కనపడుతూ వున్నావూ

విధి తగిలించిన గాయాలను గేయాలుగా మారుస్తూ
తప్పు నాదేనని తలదించు కుంటున్నా

నలుగురిలో నడవలేక మనసు మూగబోతోంది
ప్రపంచమే చిన్నదయ్యి మౌనంలో మిగిలింది
॥ కలత॥
నిజంలో నిను నిర్లక్ష్యము చేశానా?
జ్ఞాపకంగా మిగిలావు?
కన్నీళ్ళతో వెళ్ళావేమో
కలల్లో కలవార పెడుతున్నావు
కనులు మూసుకున్నానేమో అపుడు
చీకటిలో నడుస్తున్నానిపుడు
వెలుగుల్లో నడిపిస్తావనుకున్నా
వేదన మిగిలిస్తావనుకోలా
అందవు నీ అడుగులని తలచి
అస్తిత్వాన్ని కోల్పోతున్నా
నిట్టూర్పుల జీవన యానం
బలవంతపు బ్రతుకు ప్రయాణం
చేస్తున్నా జీవన సమరం
వెతుకుతూ ఆశల శిఖరం
॥ చేరలేని గమ్యం ॥
అమ్మ అని హత్తుకున్న
ఆరోజులు కావాలని
బుజ్జగించి గోరుముద్దలు 
మళ్ళి తినిపించాలని
నీ బుడి బుడి నడకల్ని
వెనుక కెళ్ళి చూదాలని
అడుగడుగున నీ గెలుపులు
ఆ గర్వం నీదవ్వాలని
సైకిల్ పై నీ స్వారీ
విజయం నీదేనంటూ
నవ్వుతున్న చిన్ని నాన్న
ఆ రూపం మళ్ళి నాదవ్వాలి
నీ జీవన పోరాటంలో
ఓడానూ చివరంటా
ఏమాయనో ఆరోజున
విషమని వేదన మింగా
నీ స్పర్శలు కావాలని
తల్లడిల్లుతున్న మనసు
జ్ఞాపకాల తడులలో
నిన్ను తడుము కుంటున్నా
మౌనమైన మనసులో
నీ మాటలు గుర్తెరిగి
గుండె పగిలి పోతోంది
రాలేవని తలచి తలచి
చెదిరిన ఆశవు నీవు
బాధ్యతల బందీ నేను
చేరలేని గమ్యం నీవు
వేదన బానిస నేను
కంటి తడులు అక్షరమై
కవనమై పోతోంది
చెరపలేని గాయాలు
కావ్యంగా మిగులుతూ
నిశ్శబ్దం మనసులోన
పెదవులనీ కదపలేక
మనసు తడిని తుడవలేను
గాయపు మచ్చను చెరపలేక
అక్షరమే ఆదుకుంది
ఆత్మీయత అందిస్తూ
చెరిగిపోని గాయానికి
చేయూతగ నిలుస్తూ
॥ కన్నీళ్ళు॥
గర్భస్థ శిసువు నువ్వు
పొట్టలో పాదాల కదలికలు
ఎంత మృదువుగా తన్నావో 
ముద్దాడాలని ఆశ ఎంతో నాకపుడు
ఎన్ని నొప్పులో నువ్వు వెలికి రావడానికి
అప్పుడేగా నువ్వు ప్రపంచాన్ని చూశావు
ఎన్నో సంతోషాలు
నొప్పులే గుర్తు లేనంతగా
అప్పటి మొదలు ఎంత ఓర్పో నాలో
ఆశ్చర్యమే నాకు
గాజుబొమ్మలా నిన్ను కాపాడుతూ
అడుగడుగునా నిన్ను గొప్పగా చూడాలన్న ఆకాంక్షతో
నీ బ్రతుకు కోసం నేను పడ్డ ఆరాటం
నీ ప్రఖ్యాతికి నేను చేసిన ప్రయత్నాలెన్నో
ఒక్కసారిగా కన్నీటి సాగరంలో తోసేశావు
మూడు సంవత్సారాలు
ఎన్ని కన్నీళ్ళు కార్చానో
ఒక్కో కన్నీటి బిందువు ఒక్కో అక్షరమై
ఎన్ని వేదనల భావాలు ఒలికించానో
బాధ్యత పేరుతో బలవంతంగా బ్రతికేస్తూ
సానుభూతి చూపుల్ని ఎదుర్కోలేక
కన్నీళ్ళు తుడుచుకుంటూ
జీవితాన్ని గడపలేక
మనసంతా వేదన నిండినా
చిరునవ్వులు ఒలికకించలేక
చివరి మజిలీ చేరాలని
నీ దరి చేరే తరుణం రావాలని ...!!
॥ మనసు తడి ॥
గోడకు వేలాడుతూ నీ యారోగేమ్
అనుక్షణం వెక్కిరిస్తూ
నీవు లేని తనాన్ని గుర్తుచేస్తుంది

టి.వి స్టాండులో దొర్లుతూనే వుంది
నువ్వు ఎగరేసి ఆడిన స్మైలీ బాల్
మరలరాని నీకోసం కన్నీరు తెప్పిస్తూ

నీవు గీసిన కార్టూన్స్ ఫైల్లో దాక్కున్నాయి
మనసులో తడిని కురిపిస్తూ

నిరాశగా చూస్తుంటాయి నా వైపు
బీరువాలో నీ స్పర్శను తాకి
కోరి కొనుక్కున్న దుస్తులన్నీ

మొబైల్లో భద్రంగానే వున్నాయి
నీవాలపించిన భగవద్గీత శ్లోకాలన్నీ
వినపడని స్పర్సించే మాటలు గుండె తడి చేస్తూ

మూగవోయాయి నీ వీడియోగేములు
బ్యాటరి మార్చమని మారాము చేసేవారు లేక
నీ చేతులు నలిపిన కీబోర్డును
నిత్యం తడుముకుంటున్నా చెమరించే కన్నులతో

సూపర్ మార్కెట్కు ఎప్పుడెళ్ళినా
నీవు చేసిన ఫోన్ కాల్ గుర్తొస్తుంది
కిండర్ జాయ్ కావాలని జాయ్ జాయ్ గా అడగడం
మౌనమై పోతుంది మనసపుడు

నీ ఇష్టాలు నాకిపుడు కష్టంగా వున్నాయ్
తీర్చలేని కోరికలన్నీ వేదనగా ప్రశ్నిస్తున్నాయ్

నిన్ను హత్తుకోవాలని ఆత్రంగా వుంది చిన్నా
ఎదురుచూపుతొ కన్నీరు కారుస్తూనే వున్నా ...!
.... నీవు లేని లోకం....

గర్భగుడిలో నువ్వున్నపుడు
నీ రూపం ఊహలతో గడిపాను
నా ఒడిలోకి నువ్వు రాగానే 
నువ్వే ప్రపంచంగా బ్రతికాను
నీ తప్పటడుగులు చూసి
మురిసి మురిసి పోయాను
ఆ అడుగులు నన్ను నడిపిస్తాయని
గర్వంగా తలెగరేశాను
చదువుల్లో నీ ప్రతిభ తెలిసి
నీ ఉన్నతికి శ్రమించాను
నీ భవిష్యత్ ప్రణాళిక తెలిసి
ఆ బాటకు భరోసా నిచ్చాను
నలతగా ఉందన్నపుడు
గుండె జారిపోయాను
నా మనసుకి సర్ది చెప్పు కుంటూ
అడుగడుగునా ఆత్మస్థైర్యం నింపాను
నా ఆశలు అడియాసలు చేస్తూ
చేజారి పోయావు
నీవే ప్రపంచం అనుకుంటే
నా ప్రపంచం మారి పోయింది
నీవు లేని లోకంలో
శూన్యమే మిగిలింది ...!!
॥ చేయూత॥

కాసేపల ఒంటరి తనాన్ని మరచి 
అలలతో ముచ్చటిద్దామని
సాగరతీరాన్నిఆలింగన చేసుకుంటాను 

కెరటాల శబ్ధాలతో మౌనంగా ఎన్ని ముచ్చట్లో.. 
పొద్దుగూకినా పట్టించుకోనంతగా
పాదాలు తాకే అలలు సంకేతిస్తు
మౌనఊసులు వింటున్నట్లుగా
చుట్టూ చీకట్లు వున్నా
కాస్త వెలుగును పంచుతూ చందమామ
తరంగాలతోను తనతోను ఎన్ని సంభాషణలో
మనసు నిశ్శబ్ధంగా వున్నా
అలల అలికిడులను ఆస్వాదిస్తున్నా
పెదవులు పలుకులు వెలిబుచ్చకున్నా
మానసముతో మాటాడుతున్నా
మది తలుపు తడుతున్నట్లుగా వుంది
మూసుకున్న సంతోషాలేవో
నిరాశలు, అశ్రువులు
సాగరంలో నిమజ్జనం చేసినట్లుగా వుంది
అంతరంగం నిర్వేదంతో నిండిపోయినా
కన్నీరుకావాలనిపించడం లేదు
సంద్రాన్ని హత్తుకోగానే
సంతోషాన్ని కౌగిలించుకున్నట్లుగా వుంది
అంత వరకు బుజ్జగించిన చేతిరుమాలు
జారిపోయింది సంద్రంలోకి
కన్నీటిని తోడు తీసుకుని ....!!
||వేదన||
మది నగరంలో వెల్లువెత్తే కన్నీటి తరంగాలు
భావాల అలలై ఆగని అక్షరాల ప్రవాహాలు
నిశ్శబ్ధపుఊహలు నీవే అవుతుంటే
నాలోకి నేనే నడిచినట్లుగా వుంది
దు:ఖాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో
నిశిలో నడుస్తూ చీకటిలో వెతుకుతూ
ఆశల రెక్కలు అతికించుకుంటూ
వెన్నెల వెలుగులు విరజిమ్మే రాత్రులకై
కనిపించని మదితో పోరాడుతూనే వున్నా
చరిత్రలో నువ్వు కలిసిపోయావు
కాలం ఒడిలో నేను కరిగి పోతున్నాను
చిధ్రమైన సంతోషాలు కావాలనిపిస్తుంటే
షడ్రుచుల సమ్మేళనమే జీవితమనుకుంటాం
చేదురుచే నాలుకపై తచ్చాడుతుంటే
కొత్త సంవర్శరానికి పలుకుతున్నా స్వాగతమంటూ
గాయాల గతాన్ని మరిపిచే శక్తి నివ్వమంటూ
మెదులుతూ నీ తప్పటడుగులు
మరువలేను నీ బోసి నవ్వులు
ఒడి ఊయలలో ఊపిన ఆక్షణాలు
పంచుకునే నీవు లేక
మరో లోకంలో నీ వున్నా
నీవే లోకంగా జీవిస్తున్నా...!!
....శోధన....
రాలే కన్నీళ్ళన్నీ నీ కై కురుస్తూ
ఇంకిపోయే నేలలోనె నీ కోసం గాలిస్తూ
చెమరించే నా మనసంతా
చెదిరిన నీ చిరునవ్వులే
ప్రతి వేకువలోనూ నీ కోసం
వెతుకుతూ గడిపేస్తూ
కలత మనసుతోనె
ప్రతిరోజును నడిపిస్తూ
తిరిగిరాని ఆశ నీవు
తేరుకోని మనసు నాది
అయినా ఏదో ఆశే నాకు
భారంగానే మునుముందుకు
సాగుతూ శోధిస్తూ
ఆశ్చ్యర్యాలేమైనా ప్రకటిస్తావేమోనని
అమ్మ అంటూ నన్ను హత్తుకుంటావేమోనని ...
.....కడలి ఓదార్పు....

మనసెపుడూ కడలి తీరాన్నే
అంటిపెట్టుకుంటుంది

కాసిన్ని ఓదార్పులు అందిపుచ్చుకుంటూ
కన్నీటిని కడలి నీటిలో కలిపేస్తూ

ఒక్కోసారి గురుతులను చెరిపేస్తూ
భవితను గుర్తు చేస్తూ వుంటుంది

అందుకేనేమో
కడలి తీరం అంటే ఇష్టం

గతం గాయాలు వెక్కిరిస్తూనేవున్నా
చెదిరిపోనీ జ్ఞాపకాలు

తలపుల్ని తడి చేస్తూనేవున్నా
ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవూ
ఆత్మస్తైర్యాన్నీ ఇవ్వలేవు

అలల అలజడిలో నా ఎక్కిళ్ళు దాచుకుంటూ
నా కన్నీళ్ళను తనలో ఇముడ్చుకుంటూ

ఎల్లప్పుడు నాకు సహకరిస్తూ
నన్ను హత్తుకుంటుంది...
నిద్ర కావాలనిపిస్తుంది......


మూసుకున్న కనుల్లోకొచ్చి
మనసు ఒక్కసారి స్వప్నిస్తుంది

వేలు పట్టుకుని నడుస్తూన్ననిన్ను
గట్టిగా హత్తుకుంటుంది

వెలుగు ప్రపంచంలోకి రావనిపించదు
రెప్పలు మూసి అలానే వుండిపోవాలని

కల చెదిరితే కన్నీళ్ళు కనిపిస్తాయని
మాసిన స్వప్నాలు వెక్కిరిస్తాయని

కన్నీటి మడుగుల్లో అడుగులు వేయ్యాలేమోనని
ఆ ఆనవాళ్ళలో నడకలు సాగించాలేమోనని

అందుకేనేమో నిద్ర కావాలనిపిస్తుంది
అపుడైనా నీ సాక్షాత్కారాలు దొరుకుతయేమోనని.....!!
.......అంతంలేని అశ్రువులు..........
కడలి తీరం చేరినపుడు
చెదిరిన కలలు తట్టి లేపుతాయి
నీ అప్పటి నవ్వులు కనిపిస్తాయి
కంటి ముందు కదలాడుతున్నట్లే
అనుభూతిస్తుంటాను
మది తీరమంతా గాలిస్తుంది
వేదనే మిగిల్చే వెదుకులాట
మనసు కన్నీటిని రాలుస్తుంది
కెరటాలు ఎగసి పడుతూనే వుంటాయి
ఒక్కోసారి తడుపుతున్న అలలను తడుముతుంటాను
నీ ఆనవాళ్ళేమైన స్పర్శించగలనేమోనని
కెరటం నాఒడి తడిపినపుడు
నీవేనని భ్రమ పడతాను
నీ స్పర్శల ఊహల్లో మురిసిపోతాను
మలికానుకవై మరలొచ్చుంటావని
కొత్త జీవితానికి పునాదులేస్తాను
అల వెనుదిరిగిoది
మనసు చెదిరిపోయింది
మళ్ళీ నీ జ్ఞాపకమే మిగిలింది
మూగనై మిగిలున్నా కడలితీరంలోకన్నీరొలికిస్తూ
కెరటాలను తడుముకుంటూ
ఆశ చావని నా కనులు
చూపులతో తీరాన్ని తడుముతూ
నీ కోసమే వెతుకుతూ
అంతంలేని అశ్రువులను రాలుస్తూ...
//నీ రూపం...//
పెదవి దాటని మాటలకు
మౌనమే సాక్షమ్ములే
మనసులోని భావమంతా
పదములుగ ప్రకటింతులే
ఆగిపోని ఆలోచనంతా
గడిచిపోయిన జ్ఞాపకములే
కనుమరుగైన రూపానికి
కనిపించదు నా కన్నీరులే
జరిగిపోయిన కాలమంతా
తిరిగిరాని స్వప్నమే
ఆశపడిన జీవితం
అందని అదృస్ఠమే
మిగిలిపోయిన జీవితం
నీ గురుతుల నీడలే
మనసు అంతా పరచుకున్న
మమత నిండిన నీ రూపమే
.....నీ కోసం.......

మనసు నీ కోసం పరిభ్రమిస్తూనే వుంటుంది
గతించిన కాలాన్ని లెక్క వేస్తూనే వుంటుంది

ఆశల పల్లకీ లో నుండి జారి పడిపోయాను
జీవిత నడకను సాగిస్తూనే వున్నాను

రాలి పడ్డ చిరునవ్వులు ఏరుకోవాలని..
విఫలమైపోతున్నా ప్రయత్నల్లోనూ..

సానుభూతి సమీరాల్లో భాష్పాలు ఒలబోస్తూ
ఓదార్పు పవనాల్లో కన్నీళ్ళు ఆరబెడుతున్నా

విరక్తి నవ్వులతో విసురుకుంటున్నాను
వెంట వచ్చే వేదన వెక్కిరిస్తూనేవుంది

విదిలించుకు ముందుకు సాగేంత
చిన్నదేం కాదుగా గాయపడ్డ జ్ఞాపకం...!!
నిరీక్షిస్తూ...నింగివంక చూస్తున్నా.
తారలలోనైనా తచ్చాడుతూ కనిపిస్తావేమోనని...!
నిన్నoదుకోవాలనే ఆరాటంలో
మరో లోకానికి దారులు వెతుకుతున్నా ...!!
..... రెప్పల మీద తచ్చాడినట్లు ......
చెమరింతలైన చిరునవ్వులు గుర్తొస్తాయి
సాక్ష్యాలు గుoడె గాయాల్ని గుర్తుచేస్తాయి
మౌనమై మనసు రోదిస్తూ
నీ తప్పటడుగులు జ్ఞాపకం చేస్తుంది
ఊహల్లో నీ అడుగుల సవ్వడి ఉలిక్కి పడేలా చేస్తుంది
రెప్పల మీద నువ్వు తచ్చాడినట్లే భావన
అమృతoలా అనిపిoచే నీ ఆలాపన
ఊహల విహారం చేయిస్తుoది
నా వేలు పట్టుకు నడుస్తున్నట్లుగా గర్వo
నా చెయ్యి జార విడుస్తావేమోనని భయo
ఎవరి మాట వినిపిoచనంత భారంగా
ఆశల ప్రపంచంలో విహారిస్తాను
నిదురరాని రాత్రైతేనేం మనసుతో నీతో మాట్లాడాను...!!
....గుర్తొస్తున్నావు...

వెలుగొదలని నీడలా నువు గుర్తొస్తున్నావు||
మనసొదలని జాడలా నువు గుర్తొస్తున్నావు||

మరలరాని లోకానికి తరలి నీ వెళ్ళిపోయావు
అడుగడుగున తలపుల్లో మాటలా నువు గుర్తొస్తున్నావు||

మనసంతా నిండివున్న మౌనంలా నే మారినా
అనుక్షణం స్వప్నంలో తోడులా నువు గుర్తొస్తున్నావు||

వేలుపెట్టి నడిపించిన క్షణాలే నీ జ్ఞాపకమై
మరువలేని గుర్తులుగా శ్వాసలా నువు గుర్తొస్తున్నావు||

ఓడిపోయి పోరాటం గెలుపురుచి నే నెరుగ లేదు
కానరాని నీ రూపం కలలా నువు గుర్తొస్తున్నావు||

//గాయం//
ఎడారిలో నేనేమీ లేను
గొoతు తడి ఆరకపోడానికి
కావల్సినన్ని కన్నీళ్ళు వున్నాయ్
కుండలు నింపుకోడానికి
జీవ చైతన్యం కోల్పోయానేమో
జీవితం అర్ధం కావడంలేదు
అమాయకత్వంలోనే వుండిపోయానేమో
అంతరంగాన్నిఅర్ధం చేసుకోలేక పోతున్నా
గాయం ఘాటుగానే తగిలింది
మనసునొప్పికి అలవాటు పడుతోంది
గుండె కఠినంగా మారమంటోంది
భవిష్యత్తును వెతక మంటోంది ..!!
//మౌనం...//
తలపోసిన వన్నీ
తీరని కోరికలైనాయి
ప్రపంచాన్ని చూడక
నే బందీ నై పోయాను
హృదయానికి గాయం
చిరునవ్వు దూరం
వెక్కి వెక్కి ఏడీపించి
మాయమై పోయావు
మమత పంచక నువ్వు
కనుమరుగై పోయావు
వంచకాల లోకంలో
ఇమడలేక పోయావా?
ఆశలన్ని వమ్ము చేసి
మెరుపువై పోయావు
బ్రతుకుదారంతా
ప్రశ్నార్ధక చిహ్నాలే
బదులు లేని బాటల్లో
పయనమౌతూ మౌనంగా
వెలుగుదారులు మూసుకున్నా
మిగిలివున్నా చీకటిలోనీవే లోకంగా.....!!
//ఆశ//
తొలి జీవితమంతా
నిను ప్రేమగ నడిపించాలనుకున్న
మలి జీవితమంతా
నువు తోడై నడిచొస్తావనుకున్న
గమ్యం నే చేరేలోగా
నువు గొప్పగ వెలగాలనుకున్నా
నా ఆయువు నీకిచ్చి
చిరునవ్వుతో నిను చూడాలనుకున్నా
నా నవ్వును మరిచాను
నువు గగనంలో కెళ్ళాక
నే శిలగా మారాను
నీ ఊపిరి ఆగాక
ఇంకా ఏదో ఆశతో
బ్రతుకు నడిపిస్తున్నా
మలి కానుకగా
నువు మరలొస్తావనుకుంటూ
నీ చిరునవ్వుల వెలుగు
నే చూడాలనుకుంటూ...!!
ఆ చిన్ని గుండే గాయాన్ని 
భరించలేక పోయింది
మౌనంగా మరలి వెళ్ళి పోయింది
రాక్షసిగా నన్ను మార్చేసింది
ఆత్మవిశ్వాసమనే అందమైన పేరుతో
నా గుండె గమన సాగిస్తొంది
ఆవేదన నిండా నింపుకుని
గాయానికి మందు రాసుకుంటూ
భారంగా బ్రతికేస్తొంది
//అక్షరాలు//

గాయపడ్డ క్షణాలు బాకులా గుచ్చుతున్న జ్ఞాపకాలే
మలాము ఎంత రాసినా మానిపోని రాచపుండును తలపిస్తూ

అనుక్షణం ఆ ఆలోచనలే మరలిపోని ఆవేదనలే
బాధలు భావాలై మౌనాక్షరాలౌవుతూ
గతం నీలినీడలు గాయాన్ని మానిపించే అక్షరాలవుతూ

చెదిరిన మనసుకు ఓదార్పుగా
గుండె గాయానికి మంత్రించే ఆయుధాలుగా
ఆత్మీయత పంచే అదృష్టాలుగా
మెలిపెడుతున్న జ్ఞాపకాలు మరిపించే సాధనాలు అక్షరాలు

నిర్లక్ష్యాల నిదర్శనాలుగా
బాధ్యత మరచిన బంధాలు ప్రశ్నించే అవకాశాలుగా
బాధల భావాలను వెలిబుచ్చే మనసుకు ఊరట కలిగిస్తూ
మాటలు పలకలేని పెదాలు అక్షరభావాలు ఒలికిస్తూ

స్వాంతన నాకు నేనుగా చెప్పుకుంటూ..
గాయపడ్డ మనసుతో గమనం సాగిస్తూ,..!!
//ప్రశ్నించే గతం//

కునుకు రాని కనులు
ఆలోచనతో అరమోడ్పులౌతాయి
జ్ఞాపకాల గాయాల్ని
మనసు తట్టి లేపుతాయి

ఆగని కన్నీరంతా
వేదనతో ఒలుకుతొంది
ఆశపడుతుంది మనసు
ఆనందపు నీరైతే బావుండని

కోల్పోయిన ఆనందాన్ని
గొoతెత్తి పిలవాలని
చేజారిన నీ రూపాన్ని
చిరునవ్వుతో చూడాలని

చెదిరిపోయిన నీ జీవన చిత్రం
సాగిపోతూ మా జీవన సమరం
ఆకాశంలో చుక్కవైనావో
మరో అమ్మ బిడ్డవైనావో
నాకు మాత్రం దూరమయ్యావు

ప్రశ్నించే గతం
ప్రశ్నార్ధకమైన భవిష్యత్
గుండె గాయాన్ని భరించ లేకుంది
ఆగిపోవాలని ఆరాట పడుతోంది

చిగురిస్తున్న ఆశలు
చితిపై వాలాయి
చిరునవ్వులు
చింతలుగా మిగిలాయి

చేజారిన నీ రూపం
చిధ్రమైన నా హృదయం
పగిలిన ముక్కలన్నీ
గాయాల జ్ఞాపకాలే
గతం నీలి నీడలే

నడిసంద్రంలో నన్నోదిలి
సుడిగుండంలోకి నువు మరలి
మది కలతలతో దిగులు పడుతోంది
కన్నీటిని దాచలేకుంది....!!
//కడలి//

సముద్రపుజీవిలా నేనూ సునామీల నెదుర్కొన్నాను
ప్రళయంతర్వాత ప్రశాంతతను పొoదలేకున్నాను
బలవంతపు బ్రతుకు చట్రంలో విధి లేక తిరుగుతూ
వేదనతో మిగిలిపోయాను

మానవసంబంధాలు మరుగై
కడలిని చూసే భయంతోనే నా కన్నీటినీ చూస్తున్నట్లు
బందాలన్నీ బందీనీ చేశాయి

దూరాన్ని లెక్కిస్తూ సంబంధాలకు దూరమవుతూ
సమాదానంలేని ప్రశ్నలు
మనసుని అల్లకల్లోలం చేస్తూన్నాయి

ఒక్కోసారి కడలి అందాలు ఆస్వాదిస్తూ
కన్నీటిని కడలిలోనే కలిపేస్తుంటా
ప్రశాంతమైన కెరటమై మనసుకు ఓదార్పు అవుతుందని

సూర్యచంద్రులను అక్కున చేర్చుకున్నట్లు
మనసు బందాలకు దగ్గర అవుతుందేమొనని...!!
//గాయం//

కనిపించని లోకంలో నీవు
కదిలే ప్రపంచంలో నేను

చేజారిన నీ రూపం
చేరువ కావాలని ఆరాటం

ఉహల్లో ఓదార్పును వెతుకుతూ
స్వప్నంలో కాంచిన రూపం స్పర్శించాలని

కన్నీటినే కలముగ మలిచి
వేదననే వాక్యాలుగ మార్చి

గాయాల జ్ఞాపకాలు
గేయాలుగ మారుస్తూ

ఓడిపోయిన అమ్మలా
మిగిలున్నా జీవత్సవంలా....!!
// చిట్టి తండ్రి//
గతం గునపమై గుచ్చుతున్న జ్ఞాపకమే
ఆరిపోని కన్నీటికి సాక్ష్యమే
శాంతి లేకుండా సాగిపోయిన జీవన గమనం
వేదనతో నిండిన మనసు

గతం గోతుల్లోకి తొంగి చూసినపుడు
గుండె మెలిపెట్టినట్టుగా
మనసులో భూకంపాలే సృష్టింబడతాయి
కన్నీటి కడలి ఉదృతమైన ప్రవాహమే అవుతుంది

అనుక్షణం నిండుకుండలా నేత్రాలు
ఒక్కోసారి పగిలి ప్రవహిస్తూ వుంటాయి
అమ్మ ఓడిపోయిందని
నాకు నేను ప్రశ్నగా మిగిలానేమోనని

బ్రతుకివ్వడానికి సిద్ద పడ్డా
తిరస్కరించిన చిట్టి తండ్రి
అమరమైన మహానుభావుడే

తను తనువు చాలిస్తే
అమ్మకి విశ్రాంతి అనుకున్నాడేమో
మౌనంగా నిర్ణయం తీసుకుని మేధావే అయ్యాడు

గుర్తించలేని నేను వేదనతో మిగిలేవున్నా
అదీ నాకేంత శిక్షో తెలుసుకోలేని చిట్టి తండ్రి
నీవులేక బ్రతికి వున్న జీవచ్చవాన్నని వాడికెలా చెప్పాలి

అమ్మ కస్టం గుర్తించిన చింటుగాడికి చెప్తూ
ఓడిపోయిన అమ్మగా రుజువుగా నే మిగిలేవున్నానని....!!
//నెరవేరని స్వప్నం//

మనోవేదన కరిగిపోయే
మమతల రూపం ఎదురుగ వున్నట్లు

కలలా మిగిలిపోయిన ఆనందం
కనుమరుగైన రూపం
స్పర్శించినట్లు

ఆశలు కోల్పోయి
అర్దాయుష్కుడైన
నా చిట్టి తండ్రి పరిపుర్ణజీవితం
నిజమై పొయినట్లు

గగనమంతా గాలిస్తున్నా
స్వర్గంలో నా కోసం నిరిక్షిస్తూ
కనిపించిన బంగారు తండ్రి
అమ్మాని హత్తుకున్నట్లు

నెరవేరని స్వప్నం
నిజమవ్వాలని ఆశతో జీవిస్తూ..!!
//నీ కోసం.....//

జో.కొట్టవా అమ్మ బజ్జుంటన్నన్నావు
గాఢనిద్రలోకెళ్ళావు జ్ఞాపకంగా మిగిలావు

నడక నేరుస్తానమ్మచేయి వదలమన్నావు
చెప్పకుండానే నాకుచేజారి వెళ్ళావు

నాబ్రతుకు గురించి బెంగ వొద్దన్నావు
బ్రంహ్మండంగా నేనుబ్రతికేస్తన్నావు

బాద నీకు వలదంటుభరోసానిచ్చావు
బాటలన్నీ మూసేసి బందించి వెళ్ళావు

కనిపించకున్నావు కనుచూపుమేరలో
జారిపోతావనుకోలేదు జాడలేకుండానే

మౌనంగా వున్నాను మనసు గెలవకున్నాను
అక్షరాలనే అమరుస్తూ పదాలనే ప్రొది చేస్తున్నాను...!!


||సంఘర్షణ||


నిష్క్రమించి
నిశ్చింతగా నువ్వు
జీవించి
జీవచ్చవంగా నేను

సమాజం వెలి వేసిందో
నే వెలి వేశానో

మూగదాన్ని అయ్యానో
మనసు చంపుకున్ననో

న్యాయాన్ని కోల్పోయానో
అన్యాయం చేశానో
సంఘర్షణ

కష్టాల సముద్రం ఈదలేక
కన్నిటి సంద్రం దాట లేక

కన్నీటి ప్రవాహంలో
కొట్టుకు పోతే బావుండు

లక్ష్య సాదనలో నిర్లక్ష్యం
స్వార్దం ముందు
సహనం ఓడిపోగా

మనీ లోకంలో
విలువలేని మానవత్వం

తపన ,తాపత్రయం
బాద్యతలు ,బంధాలు
కనరాని లోకం

బ్రతికి వున్న వారంతా
జీవచ్చావాలేమో...?

మరణించిన వారు
మహాత్ములనుకుంటా..?
||అమ్మ మనసు|| 

ఆలంబన పోయింది..
ఆక్రందన మిగిలింది
వృ దా అయిన శ్రమ అంతా
వ్యధగా నాకు మిగిలింది

నీవు లేక నాకు చెప్పలేని నష్టం
ఎలా తీరును ఈ కష్టం

కన్నీరు రాకుండా..
కష్టం నీకు లేకుండా..
అమ్మ నీ కోసం నేనంటూ...
భరోసా నిచ్చావే..
'నొప్పించక' ',నొప్పి' లెక..
నే.. చూసుకుంటానన్నావే..

తిరిగిరాని లోకాలకి
తరలి వెళ్ళిఫోయావా..
మరో క్రోత్తలోకంలో
నన్ను మరచి పోయవా..

నువ్వు వొధిలేసిన సాక్ష్యాలు...
నన్ను వెక్కిరిస్తుంటాయి
స్ప్రుశించినపుదల్లా..
నిను స్పర్సించాలని.

నీకొసం మరణించాలని..
మళ్లీ నే జన్మ నెత్తి ..
నీకు పునరజన్మ నివ్వాలని..

||క్షమించవా చిన్నా?||


చెదిరిపోయిన నీ చిరునవ్వు
చెదరవు నీ జ్ఞపకాలు...
ఆగిపొయిన నీ గుందెకు తెలియదు
నా మనసు పడే ఆవేదన...
గతమంతా నదిచాను..
రాళ్ళపై ,ముళ్ళపై
అనుభవాలన్నీ కస్టాలు,కన్నీళ్ళు
ఓడిన పోరాటాలే కాని...
గెలిచిన జ్ఞాపకం లేదు
మాసిపోదు మనసుకైన గాయం
మరువలేను నువ్వు జన్మించిన క్షణం
అనుక్షణం నీ ఆలాపన
తడిమి చూడాలనే తపన
గుండెను పిండెస్తూ వుంటుంది
నిను కోల్పోయిన క్షణం
నే బ్రతికే వున్నందుకు
బాధగా వుంటుంది ఆ క్షణం
ఓ దార్పు దొరకడం లేధు
సానుభూతి భరించడం కష్టం
దారి లేక దోషి నయ్యాను
క్షమించవా చిన్నా
తిరిగిరాగలవా నాన్న
||మ న సు||
మౌనం మనసుకు
వస్త్రంగా మారింది

కన్నీటితో అది
తడిసి ముద్ద అయ్యింది

మనసు మనసుతోనేగా
మాటాడు కుంటుంది

మౌనంగా వుంటేగా
మాటలల్లు కుంటుంది

గుండె నిండుగ దు;ఖంతో
గుబులుగా వుంటుంది

బాధను దిగమింగలేక
భారంగా మారింది

మదిలోని స్మ్రుతులన్నీ
మనసును పిండేస్తుంటే

గత జీవిత గమనాలు
గాయాలై మిగిలాయి

మనసుతో మటాడుతూ
మౌనంగా మిగిలాను
||ఆకాశం నేనైతే.... చిన్నా||

ఆకాశం నేనై..
అక్కున చేర్చుకుందామనుకున్నా..
వెలిగేచుక్కవి నువ్వయ్యవా..
వెతుకుతూవున్నా.
అంబరమంత ఆనందంగా..
నువు జీవ్వించాలను కున్నా..
అందకుండా వెళ్లావు
ఆత్మ బందువు ఆకాశం..
చుక్కలతో,చందమామతొ..
మనసు బాద చెప్పుకుంటా
నీ పాదాలు వేసిన తప్పటడుగులు..
బతుకు బాటను తడి చేశాయి
విఫలమైన మా ప్రయత్నాలు ..
భవిషత్తును శూన్యం చేశాయి.
అందరూ వున్నాఒంటరితనం
జ్ఞాపకాల 'ఇల'లొ గడిపేస్తూ..
అలసి పోయాను ..
ఓదార్పు కావాలి
భవిష్యత్తు శూన్యం
బాసట కావాలి
విధి లేక రొజు పేజీనితిప్పేస్తూ..
స డిలేని జీవితం
సంతోషాన్ని తడుముకుంటోంది
ఆశల రెక్కలు విరిగాయి..
అతికించి ఇస్తావా..
ఎడారిలా జీవితం
ఒయాశిసువై వస్తావా...

రాలేని నా చిట్టి తండ్రి కోసం మీ అమ్మ రాలుస్తున్న అక్షర కన్నీరు ....
చెమ్మగిల్లిన కనుల వెనుక
చెప్పలేని నిజాలెన్నో
గతించిన`జ్ఞపకాలలో
గుండెపిండే గాధలెన్నో..
రాలేకన్నిటి బొట్టులోను..కనిపించె నీ రూపం..
నా చేతకాని తనాన్ని..
నిలదీస్తున్నట్లుగా
నీవు లేవనే నిజం జీర్నించుకోలేని నా మనసు
భరించలేక బాధను..
నిన్ను హత్తుకోవాలని ఆశపడుతుంది
తడి ఆరని నా కళ్ళు..
కన్నీటి వర్షంకురిపిస్తూనే..వున్నా..
బలహీనమైన నా గుండెను..
బ్రతికించాలని ప్రయతీన్స్తున్నా...
ఆశలు లేవు ..
ఆకాంక్షలు లేవు..
బలవంథంగా బ్రతుకీదుస్తూ..
నీవు లేని ప్రపంచంలో..
నిర్జీవంగా బ్రతికేవున్నా..
నీ `జ్ఞాప' కలలో..
బాద్యతలు భరించలేక..
విస్మరించలేక..
మౌనంగా రొదిస్తూ..
కోల్పోయిన పేగు బంధం నన్ను అక్షరానికి దగ్గర చేసింది నా ఈ బ్లాగ్ లోని ప్రతి అక్షరమూ నా మనసు తడిని చూపిస్తుంది నేనూ వ్రాసే ప్రతి అక్షరమ్ నా చిట్టి తండ్రికే అంకితం 
అవినాష్ నిన్ను దూరమ్ చేసుకుని నేను పడే నరకయాతన ఈ అక్షరాలు ఏ చోట ఉన్నావో నీ ఉన్న చోటుకి నా అక్షరాల ఆవేదన చేరుతుందని ఆశ . నీ దూరమ్ భారంగా వుంది. క్షమించకు   ఈ అమ్మని.