॥ కడలితో కాసేపు ...॥
స్నేహ కడలిని స్పర్శించాలని
తనకలాడుతోంది
గుండె గూటిలో మిగిలేవున్న వేదనంతా
సముద్రాన్ని హత్తుకుని ఒలికించాలనీ ఉంది
కొన్ని నిమిషాలు అనుకుంటూ వెళతానా
ఎన్ని గంటలైనా తనివితీరని ఆరాధనే
మౌనంతో
అలల హోరుతో
సాగుతున్న ముచ్చట్లు
ఎడతెరిపి లేకుండా
ఎన్ని దూరాలైనా గుర్తురాని అనందం
భారాన్ని దించుకుంటున్న సంబరం
ఒలికే కన్నీళ్ళకి ఓదార్పు తీరం
తరంగాలు తడుముకుంటూ
దూరమైన బంధాన్ని హత్తుకున్న అనుభూతి
అలల పలుకుల ఆలాపనలు
నిర్వేదం తుడిచే ఆత్మీయం
వినిపించవు కన్నీళ్ళు
కనిపించవు గాయాలు
గుండె దిగులు మాయమై
కోల్పోయిన ఆనందాల వరమిచ్చినట్లు
ప్రతీక్షణం విలువైనదిగా
వీడలేని బంధమే
వాత్యల్య పలకరింపులు
తుఫానులు ఉత్పాతాలు
బ్రతుకు దెరువుల దీవెనలు
అన్నీ దాచుకున్న అంతర్యామి సాగరం
....వాణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి